TGO NEWS (mar 22) : Ranga reddy district tgos meeting. తెలంగాణా గెజిటెడ్ అధికారుల సంఘం రంగారెడ్డి జిల్లా కార్యావర్గ సమావేశం 22.03.2025 న మధ్యాహ్నం 2.00 గంటలకు IDOC కలెక్టరెట్ కార్యాలయం కొంగరకాలన్ నందు జిల్లా అధ్యక్షులు డాక్టర్ రామారవు అధ్యక్షతన జరిగింది.
Ranga reddy district tgos meeting
జిల్లా కార్యదర్శి శ్రీనేష్ కుమార్ నోరి సమావేశాన్ని ప్రారంభించగా ఈ సమావేశం లో గెజిటెడ్ అధికారుల సంఘం రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు అందరు పాల్గొన్నారు. పలు అంశాలపై విస్తృత చర్చ జరిగిన అనంతరం క్రింది తీర్మానాలు ఏమోదించడమైనది.
(1) పెండింగ్ బిల్స్ మరియు పెండింగ్ లో ఉన్న నాలుగు DA లు వెంటనే విడుదల చేయాలని తీర్మానించడమైనది.
(2)రంగారెడ్డి జిల్లాలో గెజిటెడ్ అధికారుల సభత్వ నమోదు కార్యక్రమాన్ని ఏప్రిల్ నెలలోపల పూర్తి చేయాలని తీర్మానించడమైనది.
(3) IDOC కలెక్టరెట్ కార్యాలయం, కొంగరకాలన్ నందు పనిచేస్తున్న ఉద్యోగులకు ఇంటి అద్దె భృతి 24 శాతానికి పెంచాలని మధ్యాహ్నం భోజన విరమములో నిరసన కార్యక్రమం చేయాలని తీర్మానించడమైనది.
(4) PRC ని వెంటనే ప్రకటించి అమలు చేయాలని మరియు పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్దరణ చేయాలనీ తీర్మానించడమైనది.
(5) తెలంగాణా గెజిటెడ్ అధికారుల సంఘం, రంగారెడ్డి జిల్లా అసోసియేషన్ కార్యక్రమాలకు ఒక హాల్ కేటాయించాలని మరియు సంఘం భవనం కొరకు స్థలం కేటాయింపు కోసం జిల్లా కలెక్టర్ ను కలిసి విజ్ఞప్తి చేయాలనీ తీర్మానించడమైనది.
(6) రంగారెడ్డి జిల్లా గెజిటెడ్ అధికారుల హోసింగ్ సొసైటీ ఏర్పాటుకు తీర్మానించడమైనది.
(7) జిల్లా లోని అన్ని డివిజినల్ మరియు మండల కేంద్రాలని సందర్శించి తెలంగాణా గెజిటెడ్ అధికారుల సంఘం కార్యక్రమాలని విస్తరంప చేయాలని తీర్మానించడమైనది.
(8) తెలంగాణా గెజిటెడ్ అధికారుల అసోసియేషన్ కేంద్ర సంఘం అధ్యక్షులు ఏలూరి శ్రీనివాస రావు ఆధ్వర్యంలో రాబోయే రోజులలో జరిగే కార్యక్రమలకు ఎప్పుడు పిలుపు నిచ్చిన రంగారెడ్డి జిల్లా గెజిటెడ్ అధికారులు తయారుగా ఉండాలని తీర్మానించడమైనది.
ఈ కార్యవర్గ సమావేశం లో అసోసియేట్ అధ్యక్షుడు PC వెంకటేష్, గంపా శ్రీనివాస్, ఉపాధ్యక్షులు నూతనకంటి వెంకట్, రేవతి, అలివేలు, బాలరాజు, జాయింట్ సెక్రటరీలు లక్ష్మణ్ స్వామి, అనిత, మహేశ్వరి, సుజాత, శ్రవణ్ కుమార్, రాకేష్, సైదమ్మ శాంతిశ్రీ, మంజునాయక్ మొదలగు వారు పాల్గొన్నారు