TGEJAC – ఉద్యోగ జేఏసీ చలో హైదరాబాద్

TGO NEWS (AUG. 19) : TGEJAC CHALO HYDERABAD PROGRAMME ON OCTOBER 12th. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారుల, కాంట్రాక్ట్ & అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 12న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నిర్ణయించింది.

TGEJAC CHALO HYDERABAD PROGRAMME ON OCTOBER 12th.

హైదరాబాద్‌లో ఈరోజు 206 తెలంగాణ జేఏసి ఉద్యోగ విభాగాల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, పెండింగ్ లో ఉన్న డిమాండ్లపై చర్చ జరిగింది. సమస్యల పరిష్కారం కోసం భారీ బసు యాత్రలతో పాటు, అక్టోబర్ 12న చలో హైదరాబాద్ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

సెప్టెంబర్ 1న పాత పెన్షన్ సాధన సదస్సు హైదరాబాదులో తెలుగు లలిత కళాతోరణం పబ్లిక్ గార్డెన్స్ నందు సాయంత్రం 3:00 గంటల నుండి, వేలాదిమంది ఉద్యోగుల భాగస్వామ్యంతో పోరాట సదస్సు నిర్వహణతోపాటు 33 జిల్లాల కేంద్రాల్లో నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు..

సెప్టెంబర్ 8 నుండి తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల పర్యటన ఉద్యోగుల చైతన్యం కోసం బస్సు యాత్ర చేపడుతున్నారు

TGEJAC ఉద్యమ కార్యాచరణ కింద విధంగా ఉండనుంది.

సెప్టెంబర్ 8నుంచి తెలంగాణ జిల్లాల్లో బసు యాత్రలు నిర్వహించబడతాయి.

సెప్టెంబర్ 8 – వరంగల్ జిల్లా
సెప్టెంబర్ 9 – కరీంనగర్ జిల్లా
సెప్టెంబర్ 10 – ఆదిలాబాద్ జిల్ల
సెప్టెంబర్ 11 – నిజామాబాద్ జిల్లా
సెప్టెంబర్ 12 – సంగారెడ్డి, మెదక్ జిల్లాలు
సెప్టెంబర్ 15 – వికార్‌ఆబాద్, రంగారెడ్డి జిల్లాలు
సెప్టెంబర్ 16 మహబూబ్ నగర్ జిల్లా
సెప్టెంబర్ 17 నల్గొండ జిల్లా
సెప్టెంబర్ 18 ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు
సెప్టెంబర్ 19 మిగతా జిల్లాలు

ప్రస్తుతం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 125కి పైగా ఉద్యోగ సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు.

ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు నోటితో పలకరించి, నొసటితో వెక్కిరించినట్లుగా ఉందని తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ ఆక్షన్ కమిటీ (TGEJAC నాయకులు తప్పు పట్టారు.

మంగళవారం నాడు నాంపల్లి లోని TNGO కార్యాలయంలో TGEJAC కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సర కాలంగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను ఇదిగో తీరుస్తాం, అదిగో తీరుస్తామని కమిటీలు వేస్తూ కాలం గడపడమే తప్ప సమస్యల పరిష్కారం చేయలేదని నాయకుల విమర్శించారు.

ప్రభుత్వంతో సామరస్యం ముగిసిందని, డిమాండ్ల సాధనకు తమకు ఇక సమరమే మిగిలిందని అన్నారు. అందుకే సెప్టెంబర్ 8 నుండి తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సి బస్సు యాత్రలు చేస్తూ ఉద్యోగులను గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు కదిలిస్తామని చివరగా అక్టోబర్ 12న చలో హైదరాబాద్ నిర్వహిస్తామని తెలంగాణ టీజేఏసీ ప్రకటించింది.

గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం పెండింగ్ బిల్లులు నెలకు 700 కోట్లు ఉద్యోగ లోకానికి చెల్లిస్తామని చెప్పినప్పటికీ బకాయిలు ఇప్పటివరకు చెల్లించకుండా తాత్సర్యం చేస్తున్న ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి గారు ఉద్యోగుల గోడును పెడచెవిన పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, అలాగే EHS ఉద్యోగుల ఆరోగ్య కార్డులను మంజూరు చేస్తామని చెప్పి గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ తోనే పథకాన్ని ప్రారంభిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శిగారు EHS అమలుకు మోకాలు అడ్డుపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, అలాగే, బకాయిపడ్డ 5 DA లు అడిగితే కేవలం ఒక్క డిఏ మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోవడంలో ఆర్ధిక శాఖ అధికారుల నిర్లక్ష్యం కనబడుతున్నది.

అలాగే 1.7.2023 నుండి అమలు చేయాల్సిన నూతన వేతన సవరణ మాట ఎత్తకపోవడం, అధికారుల కమిటీ TGEJAC ఇచిన 63 డిమాండ్ లకు సంబంధించిన నివేదికను ఇంతకాలం. బయట పెట్టకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం కదా అని ప్రశ్నించారు..

ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీ తమ సమస్యల పరిష్కారం కోసం 20 నెలలుగా వేచి చూసినప్పటికి ప్రభుత్వం నుంచి హామీలు ఇచ్చినప్పటికీ, ఆ హామీలు అన్ని పరిస్కరించబడాలని టీజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస రావు తెలియజేశారు.

ఉద్యోగుల ప్రధాన సమస్యలు.

  1. పెండింగ్ లో ఉన్న 5 కరువు భత్యాలను తక్షణమే విడుదల చేయాలి.
  2. ఆరోగ్య రక్షణ పథకాన్ని (EHS) జూలై నెల ఆఖరులోపే పూర్తిస్థాయిలో నిబందనలనురూపొందించి అమలు చేయాలి.

3.. క్యాబినెట్ సమావేశంలో ఆమోదించిన విధంగా నెలకు 700 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు క్రమం తప్పకుండా చెల్లించాలి.

4. 41%కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి.

  1. ఏకీకృత సర్వీసు రూల్స్ అమలు చేయుటకు తక్షణమే అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి.
  2. 2003 డిఎస్సీ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 57 మేమో ద్వారా పాత పెన్షన్ అమలు చేయాలి.
  3. పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని 51శాతం ఫిట్మెంట్ అమలు చేయాలి.
  4. వివిదకారణాలతో సస్పెండ్ అయిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి
  5. గచ్చిబౌలి స్థలాలను భాగ్యనగర్ టీఎన్జీవోలకు కేటా-యించాలి
  6. స్థానికత ప్రాతిపదికగా అదనపు పోస్టులు సృష్టించి జీఓ 317 బాధితులకు న్యాయం చేయాలి.
  7. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పదోన్నతుల కమిటీలను సకాలంలో ఏర్పాటు చేసి ప్రమోషన్లు ఇవ్వాలి. అలాగే మిగితా పెండింగ్ సమస్యలనింటిని వెంటనే పరిష్కరించాలి.
  8. నూతనముగా ఏర్పడిన మండలాలకు (MPP) మరియు MEO పోస్టులను మంజూరు చేయాలి
  9. S.S.A ఉద్యోగుల 29 రోజుల సమ్మె కాలపు వేతనాన్ని మంజూరు చేయాలి.
  10. సెప్టెంబర్ 1 ని పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ నిరసన కార్యక్రమాలు జిల్లా కేంద్రాలలో జరుపుతాం.