దేశానికి ఆదర్శం తెలంగాణ బి సి 42% బిల్లు – ఉద్యోగ జాక్ నేతలు

TGO NEWS (AUG. 05) : TGEJAC ON BC 42% RESERVATION BILL. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన ఆధారంగా రూపొందించిన బి సి ల 42 % రిజర్వేషన్ బిల్ కు రాష్ట్రపతి ఆమోదం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి కి తమ మద్దతును తెలుపుతున్నామని తెలంగాణ ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ మారం జగదీష్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస రావు తెలిపారు.

TGEJAC ON BC 42% RESERVATION BILL

ఈ దిశగా దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి లో తాము భాగస్వామ్యం అవుతున్నామని తెలిపారు ఢిల్లీలోని తెలంగాణ భవన్ కు చేరుకున్న జాక్ నేతలు మంత్రి వాకిటి శ్రీహరి విప్ ఆది శ్రీనివాస్ లతో కల్సి మాట్లాడారు.

భారత ప్రజల సుదీర్ఘ పోరాటం వాటి అకాంక్షలను సామాజిక న్యాయం రూపేణా రాజ్యాంగం ప్రతిపలింప చేసిందని ,ఈ వెలుగులో ఇలాంటి ప్రజాస్వామిక బిల్ ను రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.

రాష్ట్ర జనాభాలో 56.33% ఉన్న బి సి లకు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలలో,స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ లు కల్పించడం సహజ న్యాయమని ,అవకాశాల సమానత లో అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు అందుతాయని తెలిపారు. ఇలాంటి సామాజిక న్యాయం ద్వారా సమాజంలో శాంతి సామరస్యత లు ఏర్పడుతాయని అన్నారు.

ఈ వెలుగులో తెలంగాణ ప్రభుత్వం రూపొందించి అన్ని రాజకీయ పక్షాల ద్వారా శాసనసభ లో ఆమోదింపవేసిన 42% బి సి రిజర్వేషన్ బిల్ దేశానికి మార్గదర్శకం అని అన్నారు . కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందించి తక్షణమే రాష్ట్రపతి ఆమోదం కోసం కృషి చేయాలి.సామాజిక న్యాయ సాధన లో గొప్ప ముందడుగుగా నిలిచిపోతుంది అని అన్నారు
ఈ సంఘీభావ కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నేతలు ఏనుగుల సత్యనారాయణ,యాదగిరి నర్సింహ రెడ్డి నజీర్ శ్రీకాంత్ రాజీవ్ రెడ్డి లు పాల్గొన్నారు