TGO NEWS (MAY 13) : TGEJAC STATE LEVEL MEETING AND DECISIONS. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నేడు రాష్ట్రస్థాయి విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రస్తుతం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించి కీలక నిర్ణయాలను తీసుకుంది.
TGEJAC STATE LEVEL MEETING AND DECISIONS
దేశం ఎన్నోసార్లూ ఉగ్రదాడులకు గురి కాబడినది, ఇకను గురి అవుతూనే ఉంది, దానిని తిప్పికొట్టటానికి ఈ దేశానికి మరియు సైనికులకు తెలంగాణ ఉద్యోగ JAC (TGEJAC) సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది.
అలాగే తెలంగాణ ప్రజల హక్కులు కాపడడంలో కూడ, 1967 నుండి తెలంగాణ ఏర్పాటు అయ్యేంత వరకు ముందు వరసలో ఉన్నాము.
వీటితోపాటు, మా ఉద్యోగుల హక్కులు, రాయితీలు సాధనలో నిరంతర పోరాటం చేస్తూ వాటి సాధనలో ఎన్నో కష్ట, నష్టాలు వచ్చినా, వాటిని ఎదుర్కొని ఉద్యోగుల హక్కులను, రాయితీలను సాధించుకుంటున్నాము.
ఈ ప్రభుత్వం ఏర్పాడిన గత 16 నెలలుగా ఉద్యోగుల హక్కుల సాధనకై ప్రభుత్వానికి సహకరిస్తూనే, ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకొని సంయమనం పాటిస్తూ తప్పని సరి పరిస్థితిలలో ప్రభుత్వం పై ఎంత ఒత్తిడి చేసినా పెద్దగా స్పందన కనబడలేదు. కావున సమస్యల సాధన కోసం ప్రకటించిన కార్యాచరణలో భాగంగా 04-05-2025 నాడు జరిగిన తెలంగాణ ఉద్యోగుల, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మికుల మరియు పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (TGEJAC) సమావేశ ఒత్తిడి మేరకు, ఎంతో కాలంగా ఎదురుచుస్తున్నా (57) ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పైన అధికారుల కమిటీని శ్రీ నవీన్ మిట్టల్, IAS, ప్రిన్సిపల్ కార్యదర్శి (రెవెన్యూ) గారి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరియు రాష్ట్రప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం.
రాష్ట్ర ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఏమిటంటే, మేము బోనస్ లు గాని, ఎలాంటి అదనపు భత్యాలు గాని, జీతాల పెంపు గాని, అదనపు కొరికలు గాని కోరటం లేదు, కాని ప్రభుత్వ ప్రకటనతో ప్రజలు మమ్మల్ని ధోషులుగా చూసే అవకాశం కలదు.
D.A.లు అనేవి పెరిగిన ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వత రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా ప్రకటించాల్సి ఉంటుంది. మన రాష్ట్రంలో (5) DA లు పెండింగ్ లో ఉన్నాయి. ఇంకో నేల రోజులు గడిస్తే 6 వ D.A. కూడా వస్తుంది.
సత్వరం పరిష్కరించాల్సిన మా డిమాండ్లు:
ఆర్ధికేతర (47) సమస్యలపై సత్వరం దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలి.
పెండింగ్లో ఉన్న 10,000 వేల కోట్ల ఉద్యోగుల బిల్లులు వెంటనే విడుదల చేయాలి.
పెండింగ్ లో ఉన్న 5 D.A. లను వెంటనే విడుదల చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సి (PRC) నివేదికను తెప్పించుకుని 51 శాతము ఫిట్మెంట్ ను అమలుచేయాలి.
ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) ను అమలు చేయాలి.
జి ఒ 317ని సమీక్షించి బాదితుల బదిలీల కొరకు సూపర్ న్యూమరరి పోస్టులను కల్పించి వీలైనంత త్వరగా స్తానికత కోల్పోయిన ఉద్యోగ, ఉపాధ్యాయులను తిరిగి వారి స్తానిక జిల్లా / జోన్ లకు కేటాయించాలి.
ఈ సమావేశంలో క్రింది తీర్మానాలు ఏకగ్రీవముగా అమోదించనైనది.
అధికారుల కమిటీ వేసినందున, TGEJAC ప్రకటించిన కార్యాచరణలో భాగంగా 15-05-2025 నాడు, భోజన విరామ సమయంలో తలపెట్టిన నిరసన ప్రదర్శనను తాత్కలికంగా వాయిద వేయడం అయినది, తదుపరి తేది త్వరలో ప్రకటించడం జరుగుతుంది.
చిన్నారెడ్డి గారి కమిటీ అని, గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క మల్లు గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ అని, ఇప్పుడు గౌరవ నవీన్ మిట్టల్ గారి ఆధ్వర్యంలో అధికారుల కమిటీ అని, కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా తక్షణమే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
సాధారణ బదిలీలు-2025 ఏప్రిల్, మే నెలలోనే చేపట్టాలి, గత ఎలాక్షన్ లో జరిగిన బదిలీలను వెంటనే వారి సొంత జిల్లాలకు పంపించాలి.
దేశంలో ప్రస్తుతం జరుగుచున్న యుద్ధ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా దేశ, రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా / సహాయంగా ఉండటానికి చైర్మన్ మరియు సెక్రటరి జనరల్ ఏ నిర్ణయమైన తీసుకోడానికి సంపూర్ణ అధికారం కల్పించనైనది.
మాజీ ఉద్యోగ సంఘాల నాయకులు ఎంప్లాయీస్ కో. ఆర్డినేషన్ కమిటీ పేరు మీద ప్రెస్ మీట్లలో మాట్లాడేప్పుడు ఉద్యోగుల పక్షపాతులుగా మాత్రమే వ్యవహరిస్తే బాగుంటుంది కానీ, ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల జేఏసీ కి మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరించ వద్దని కోరుతున్నాము…ఉద్యోగుల జేఏసీ కి ఉద్యోగుల హక్కుల సాధన ఒక్కటే ఏకైక లక్ష్యం గా ఉన్నది తప్ప మాకు ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా కానీ, వ్యతిరేఖంగా పనిచేయమని తెలియజేస్తునాము…
తదుపరి త్వరలో జరిగే అధికారుల కమిటీ, క్యాబినెట్ సబ్ కమిటీలతో చర్చలు పూర్తి అయిన పిదప, మరో సారి TGEJAC సమావేశమై తదుపరి కార్యాచరణ తీసుకొనుటకు నిర్ణయించనైనది.