ప్రభుత్వ చొరవకు అభినందనలు తెలియజేసిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ

TGO NEWS (JUNE 06) : TGEJAC THANKFUL TO GOVERNMENT. ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకున్నందుకు తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్, కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉప ముఖ్యమంత్రి గౌ.శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, యావత్తు క్యాబినెట్ మంత్రులు అందరికీ, ప్రత్యేక ఆహ్వానితులు గౌ. శ్రీ కేశవరావు గారికి, గౌరవ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణ రావు గారికి, ఆఫీసర్స్ కమిటీ చైర్మన్ గౌ.శ్రీ నవీన్ మిట్టల్ గారికి, గౌరవ సభ్యులు శ్రీ లోకేష్ కుమార్ గారికి, మరియు గౌ. శ్రీకృష్ణ భాస్కర్ గారికి ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా గారికి, సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్రీ మహేష్ దత్ ఎక్క గారికి, ప్రభుత్వ పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నమని TGEJAC చైర్మన్ మారం జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏలూరిశ్రీనివాసరావు లు తెలిపారు.

TGEJAC THANKFUL TO GOVERNMENT.

కొత్త ప్రభుత్వం కొలువుతీరి 18 నెలలు అయిన సందర్భంగా ఉద్యోగులు కోరుకున్న ప్రభుత్వమే అధికారoలోకి వచ్చినప్పటినుండి ఉద్యోగుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వంతో స్నేహపూర్వకంగా ఉంటూనే పరిష్కరించుకోవాలనే ఆలోచన విధానంతో ఉద్యోగులు పనిచేస్తున్నారు, మొదటగా తేది 24-10-2024 టిజిఇజేఏసి తో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల తో సమావేశం జరిగింది, తదుపరి క్యాబినెట్ సబ్ కమిటిని తేది: 8-11-2024 నాడు నియమించడం జరిగింది, ప్రాథమిక సమావేశం తేది 7-3-2025 న గౌ. ఉప ముఖ్య హమంత్రి వర్యులు టిజిఇజేఏసి తో నిర్వహించినారు, తదుపరి ఆఫీసర్స్ కమిటిని తేది 6-5-2025న నియమించినారు తరువాత పలు దఫాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌ. ఉప ముఖ్య మంత్రి వర్యులు ఆఫీసర్స్ కమిటిని కలిసి ప్రధాన 57 డిమాండ్లను, మరియు 217 సాధారణ డిమాండ్లను పరిష్కరించమని విజ్ఞప్తి చేయడం జరిగిందని గుర్తు చేశారు.

ఈ మేరకు (2) డిఏలు మంజూరు, నెలకు 700 కోట్లు పెండింగ్ బకాయిలు చెల్లించటం, ఉద్యోగుల హెల్త్ కార్డుల కొరకు హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేయటం, సకాలంలో ప్రమోషన్స్ ఇవ్వటానికి డిపిసి లను ఏర్పాటు చేయడం, సెక్రటేరియట్ లో 12.5% హెచ్ ఒ డి కోటాను పునరుద్ధరించడం, స్టేట్ లెవెల్ మెడికల్ ఇన్వలిడేషన్ కమిటిని ఏర్పాటు చయడం, నర్సింగ్ డైరెక్టరేట్ ని ఏర్పాటు చేయటం, ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మరియు సంఘాలకు రికగ్నైజషన్ ఇవ్వాటడం, జి.ఒ. 317లో ఇంకా కొన్ని క్యాటగిరిలను చేర్చటం మరియు ఎలక్షన్ లో జరిగిన బదిలీలను పూర్వ స్థానాలకు బదిలీ చేయడం, తదితర అంశాలే కాకుండా 45 ఆర్దికేతర సమస్యలపై ఉద్యోగ అనుకూల విధానాలను తీసుకున్నారు.

అయినప్పటికీ ప్రధాన సమస్యలు పెండింగ్ లో ఉండడం వల్ల రాష్ట్రంలో దశాబ్దాల కాలం తర్వాత 206 ఉద్యోగ సంఘాలతో 13.50 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తూ ఏర్పడిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నాయకత్వంలో అనేక సమావేశాలు, సభలు ఏర్పాటు చేసుకొని, జిల్లా శాఖలు, డిపార్టుమెంటు శాఖలు ఏర్పాటు చేసుకొని, రాష్ట్రస్థాయిలో పోరాట కార్యక్రమాన్ని ప్రకటించటం వల్ల ప్రభుత్వం కొంత అసహనానికి గురైనప్పటికీ అంతిమంగా ఉద్యోగుల ఆకాంక్షలను గమనించి సమస్యల పరిష్కారం కోసం క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం, ఆ క్యాబినెట్ సబ్ కమిటీ గత (7) నెలలుగా ఒక్కసారి కూడా కూర్చోనప్పటికీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టిన మేరకు కేబినెట్ సబ్ కమిటీకి అనుబంధంగా ఆఫీసర్స్ కమిటీ మే 6 న ఏర్పాటు చేసి, ఉద్యోగుల పలు పెండింగ్ సమస్యలను పరిష్కరించడం కోసం ఆఫీసర్స్ కమిటీ, ఉద్యోగుల జేఏసీతో అనేక దఫాలుగా చర్చలు జరిపిన పిదప ప్రధాన 57 డిమాండ్ల మీద ఒక పరిష్కారాన్ని చూపించడానికి ఆఫీసర్స్ కమిటీ చొరవ తీసుకొని తమ యొక్క రికమండేషన్స్ క్యాబినెట్ సబ్ కమిటీకి అందజేసిన మీదట జూన్ 4, 2025న విస్తృతస్థాయి క్యాబినెట్ సబ్ కమిటీ మరియు ఆఫీసర్స్ కమిటీ కలిసి 206 భాగస్వామ్య సంఘాల జేఏసీ నాయకులతోటి సుదీర్ఘమైన చర్చలు జరిపిన మీదట జూన్ 5, 2025న జరిగిన క్యాబినెట్ సమావేశంలో అనేక ఉద్యోగ అనుకూల నిర్ణయాలను తీసుకున్నందుకు ప్రధానంగా 1+1(2) డీఎల మంజూరు తదితర అనేక ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో క్యాబినెట్ ఆమోదించడం, తెలంగాణ ఉద్యోగుల జేఏసీకి చాలా ఆనందాన్ని కలగజేసింది.

ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలు ఉన్నాయి కనుక త్వరలోనే వాటిని ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో సానుకూల దృక్పదంతో పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు.