ఐక్యతతో పని చేద్దాము – హక్కులు సాధించుకుందాం – TGO రాష్ట్ర కార్యవర్గము

TGO NEWS (FEB. 22) : TGOs state body meeting decisions. తెలంగాణ స్వేద సౌధం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల సెమినార్ భవనంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘ కేంద్ర కార్యవర్గం సమావేశం విజయవంతంగా జరిగింది.

TGOs state body meeting decisions

1930 లలో వందేమాతర ఉద్యమం , 1950లలో ముల్కీ ఉద్యమం , 1970 లలో విప్లవ విద్యార్థి ఉద్యమం , మలిదశ దశ రాష్ట్ర ఉద్యమ నిప్పురవ్వలను రాజేసిన ఎందరో గొప్ప పాలనాధికారులను శాస్త్రవేత్తలను అందించిన ఉస్మానియా క్యాంపస్ చైతన్య భరిత ప్రాంగణంలో జరిగిన కార్యవర్గ సమావేశం ఆద్యంతం ఆలోచనాత్మకంగా కార్యాచరణకు నిర్దేశం ఇచ్చేలా జరిగింది.

అధ్యక్ష్యుడు ఏలూరి శ్రీనివాసరావు తన ప్రసంగంలో… ఉద్యోగుల ఆకాంక్షల వెలుగులో పని చేసే సంఘానికి నిర్మాణ సూత్రాలను పాటించడం ప్రాణప్రదం అని జిల్లా కార్యవర్గాలు పాటించి నమూనాగా గా నిలువాలి. సంఘం ఒక జీవ స్రవంతిలా పని చేయడానికి సభ్యత్వ నమోదు చాలక శక్తిగా పని చేస్తుంది. ఒక ఉద్యమంగా స్వీకరించాలి. సుశిక్ష్టులైన నాయకత్వం సభ్యులు గల సంఘం ఉద్యోగలోక అభిమానం పొందుతుంది. పాలక పక్షం మన మాట వింటుంది. టిజిఓ భవనాల నిర్మాణానికి స్థల కేటాయింపుకై అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం నుండి ఆదేశాలు త్వరలో వస్తాయి. కేంద్ర సంఘ భవనానికి స్థలాన్ని గుర్తించాము. ప్రస్తుతం భవన కొనసాగింపుకు మరో మూడు సంవత్సరాల ఒప్పందం జరిగింది.

ఐలమ్మ, కొమురయ్య, బందగీ, రావి నారాయణ రెడ్డి, మల్లు స్వరాజ్యం, కాళోజీ, జయశంకర్ లాంటి అనేక మంది తెలంగాణ వైతాళికుల జయంతి వర్ధంతులు, జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత గల రోజులు వాటి ఇతివృత్తాన్ని సమాజానికి తెలియజేసే కార్యక్రమాలు చేపట్టాలి. ఈ వెలుగులో మహిళా దినోత్సవం స్ఫూర్తిని ప్రతిఫలించేలా నిర్వహించాలి.

కేంద్ర సంఘం మార్చి 6, 7 లలో నిర్వహించే మహిళా దినోత్సవ వేడుకలకు అన్ని జిల్లాల నుండి మహిళా సభ్యులు పాల్గొనేలా కృషి చేయాలి. జిల్లాల జాక్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయడంలో మన సంఘం కీలక భూమిక పోషించాలి. ఆర్ధిక క్రమశిక్షణ పారదర్శకత పాటించాలి. అనుబంధ విభాగాల ఎన్నికలు పూర్తి చేసుకోవాలి. గత సంవత్సర కాలంగా నిత్యం నిరంతరం పూర్తి సమయం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పలు రూపాలలో ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమం గొప్ప పోరాటానికి ఫలితాలను ఇవ్వడానికి ఒక భూమికగా పనిచేస్తుంది. అసంతృప్తి అశాంతికి దారి తీయకుండా పాలకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పెండింగ్ బిల్లులను యుద్ధప్రాతిపదికన చెల్లించాలి.

ఉద్యోగులు తీవ్ర పోరాట రూపం ధరిస్తే పాలన స్తంభించి పోతుంది. ఈ స్థితి రాకుండా ఇచ్చిన మాట మేరకు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి గౌరవ సి యం గారు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ను పునరుద్ధరించాలి. అలసత్వం వహిస్తే కఠిన పోరాటాలకు సీదమవుతాం.

సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో 35 టీజీఓ శాఖలు,యాభై కి పైగా అనుబంధ ఫోరమ్స్ ప్రతినిధులు తమ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. వీరందరి ప్రసంగాలలో వ్యక్తీకరణ లో వ్యక్తమైన అభిప్రాయాలు

నిద్రాణ నైరాశ్య పరిస్థితులను అధిగమించి సంఘ నిర్మాణం, సమస్యల పరిష్కారానికి టిజిఓ నూతన జవసత్వాలు పొందింది. నిబద్ధతతో పని చేస్తున్న కేంద్ర సంఘ కార్యవర్గాన్ని అభినందించారు. ఉద్యోగుల మౌలిక సమస్యల పరిష్కారానికి సంఘం చేసే కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తాము.

ఈ సమావేశం పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది. వాటి వివరాలు….