TGOS – ఉద్యోగులు సమస్యల పరిష్కారానికి టీజీవోస్ కీలక తీర్మానాలు

TGO NEWS (JULY 05) : TGOS STATE MEETING IN YADAGIRIGUTTA. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం యాదగిరిగుట్టలో ఈరోజు జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర నాయకత్వం మరియు 33 జిల్లాల నాయకత్వాలు హాజరయ్యాయి. అలాగే 100కు పైగా అనుబంధ సంఘాలు నాయకులు కూడా ఈ సమావేశానికి హాజరై విజయవంతం చేశారు .

TGOS STATE MEETING IN YADAGIRIGUTTA

ఈ సమావేశంలో రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల మీద చర్చించి వాటి సాధన కొరకు తీర్మానాలు చేయడం జరిగింది.

అలాగే జాతీయస్థాయిలో కూడా గెజిటెడ్ అధికారుల సంఘాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని సమావేశం తీసుకోవడం విశేషం.

  1. ప్రభుత్వం (కేబినేట్) ప్రకటించి, ఆమోదం తెలిపిన, హామి ఇచ్చిన సమస్యలపై యావత్ తెలంగాణ గెజిటెడ్ అధికారుల (87,264) తరపున మనస్పూర్తిగా కృతఙ్ఞతలు, ధన్యవాదములు తెలుపనైనది.
  2. ఆర్థిక శాఖ (ఈ-కుబేర్) లో పెండింగ్ లో ఉన్న మెడికల్ బిల్లులు 180 కోట్లు చెల్లించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ మిగతా అన్ని రకాల పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని తీర్మానించనైనది.
  3. (4) 4. 2 (01-07-2023, 01-01-2024 & 01-07-2024, 01-01-2025) వెంటనే విడుదల చేయాలని తీర్మానించనైనది.
  4. ప్రభుత్వం ప్రకటించిన మేరకు; ప్రభుత్వం మరియు ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ సమాన నిష్పత్తి లో చేసి ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఇ.హెచ్.ఎస్) ను వెంటనే అమలు పరదాలి. ట్రస్ట్ లో ఉద్యోగులకు సమాన భాగస్వామ్యం ఉండాలని తీర్మానించనైనది.
  5. రాష్ట్రంలో కాంట్రిబ్యూషన్ పెన్షన్ రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ చేయాలని తీర్మానించనైనది.
  6. ప్రభుత్వం ఆమోదించిన; ఉద్యోగ సంఘాలకు రికగ్నైజేషన్ పునరుద్ధరించి జాయింట్ స్టాప్ కౌన్సిల్ ను మరియు ఆఫీసర్స్ కమిటీని ఏర్పాటు చేయుటకు క్యాబినెట్ అప్రూవ్ చేసినందున తగు ఉత్తర్వులు వెంటనే విడుదల చేయాలి.
  7. ప్రభుత్వం సమ్మతి తెలిపిన; పెండింగ్ లో ఉన్న సెప్టెంబర్ మాసంలోనే డి.పి.సి. లను అన్ని శాఖలలో నిర్వహించి ఉద్యోగులకు వెంటనే పదోన్నతి కల్పించాలని తీర్మానించనైనది.
  8. పి.ఆర్.సి. రిపోర్ట్ ను వెంటనే తెప్పించుకొని ఉద్యోగులకు తెలంగాణ రెండవ పి.ఆర్.సి. ని వెంటనే అమలు చేయా లనితీర్మానించనైనది.
  9. ప్రభుత్వం ఇచ్చిన హామి మేరకు; పెండింగ్ లో ఉన్న అద్దె వాహనాల బకాయిలను వెంటనే విడుదల చేయాలి: అద్దె వాహనాలకు ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.34 వేలను 2012లో నిర్ధారించిన విధంగా ఇప్పటికి చెల్లిస్తున్నారు. డీజిల్ ధరలు రెట్టింపు అయినందున కనీసం రూ.50 వేలకు పెంచాలని తీర్మానించనైనది.
  10. ప్రభుత్వం తెలిపిన హామీ మేరకు: జి.ఓ.317 అమలులో నష్టపోయి ఉద్యోగులు చేసుకొన్న ఫిర్యాదులను, దరఖాస్తులను పరిశీలించి క్యాబినెట్ కమిటీ సమర్పించిన నివేదిక ప్రకారం ఉద్యోగ సంఘ ప్రతినిధులతో చర్చించి ఉద్యోగులకు న్యాయం చేయాలని తీర్మానించనైనది.
  11. ప్రభుత్వం ప్రకటించిన హామి మేరకు; హెచ్.ఓ.డి. ఉద్యోగులను 12.5% కోటను పునరుద్ధరించి సెక్రటేరియట్ లోకి తీసుకోవాలని తీర్మానించనైనది.
  12. కొత్తగా ఏర్పడిన జిల్లాలలో, పాత జిల్లాల ప్రకారం అన్ని విభాగాలలో అదనపు క్యాడర్ స్ట్రెంత్ ను వెంటనే మంజూరు చేయాలని తీర్మానించనైనది.
  13. ప్రస్తుతం 1వ పి.ఆర్.సి.ని అమలుకు నోచుకోని ఉద్యోగులకు మరో (6 నెలలు చివరి అవకాశం కల్పిస్తూ జిల్లాస్థాయి హెచ్.ఓ.డి.లకు అధికారాలు ఇస్తూ గడువు పెంచాలని తీర్మానించనైనది.
  14. ప్రభుత్వ హామీ మేరకు; పదవీ విరమణ పొందిన అధికారులను తిరిగి సర్వీసులోనికి తీసుకోరాదని మరియు పునర్ నియామకం చేయరాదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయనైనది.
  15. తెలంగాణ ఉద్యోగుల అన్ని పెండింగ్ సమస్యలను సత్వరమే పరిష్కరించాలి.
  16. ఇతర కారణాలతో (ఏ.సి.బి. విజిలెన్స్, డిసిప్లినరి తదితర విషయాలలో) సస్పెండ్ అయిన ఉద్యోగులను ప్రభుత్వ నిబంధనల మేరకు (6 నెలలు / 2సం. ల లోపుగా విధుల్లోకి తీసుకోవాలి.
  17. 2025 సభ్యత్వ నమోదు కార్యక్రమం, జూలై లోపుగా పూర్తి స్థాయిలో చేయవలెనని ఏకగ్రీవంగా తీర్మానం చేయనైనది.
  18. 2024కు సంబంధించి జిల్లాల మరియు ఫోరమ్స్ ల మెంబర్ షిప్ మరియు ఎన్నికలకు సంబంధించిన పెండింగ్ లో వున్న సెంట్రల్ అసోసియేషన్ కు జమ చేయవలసిన పైకం వెంటనే జమ చేయుటకు ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానం చేయనైనది.
  19. ఇంకను ఎన్నికలు నిర్వహించని టిజివో డిపార్టుమెంట్స్ ఫోరమ్స్ ల ఎన్నికల ను వెంటనే నిర్వహించ వలసినదిగా ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానం చేయనైనది.
  20. సెంట్రల్ అసోసియేషన్ కు సంబంధించిన ఈ రోజు వరకు జరిగిన ఆర్థిక లావాదేవీలు, జమ ఖర్చులు బ్యాంక్ స్టేట్ మెంట్ ఆధారంగా ఈ రోజు వరకు నిశితంగా పరిశీలించి, చదివి వినిపించినందున అన్నింటిని ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానం చేయనైనది.
  21. జిల్లాల శాఖలు మరియు ఫోరమ్స్ ల ఆఫీసు భవనాలకు సంబంధించి ల్యాండ్ అలాట్ మెంట్ నిర్మాణం తదితర విషయాలపై సత్వరం ప్రాసెస్ చేయవలసిందిగా ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానం చేయనైనది.
  22. అన్నీ జిల్లాల శాఖల యొక్క హౌసింగ్ సొసైటీ ల ఏర్పాటు చేయవలసిందిగా ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానం చేయనైనది.
  23. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానించిన తీర్మానాల వినతి పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి, ఉద్యోగుల సమస్యలపై వేసిన మంత్రివర్గ ఉప సంఘానికి, ఆఫీసర్స్ కమిటికి అందచేయాలని తీర్మానించనైనది.