TGO NEWS (MARCH 07) :TGOS Womens day 2025 celebration grand success. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల దోమలగూడ ప్రాంగణంలో నిర్వహించిన మహిళా దినోత్సవ క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సమావేశం ఈరోజు జరిగింది.
TGOS Womens day 2025 celebration grand success.
ముఖ్య అతిథిగా హాజరైన శాసనమండలి సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ… ఆకాశంలో సగం అనంత కోటి నక్షత్రాల్లో సగం అవనిలో సగమైన మహిళలు అవకాశాలలో సమానత్వం అందిపుచ్చుకోవాలని కోరారు. మహిళలకు ఆపాదించిన అంక్షలు,మూఢనమ్మకాలపై, వివక్షతపై శతాబ్ధాల కాలంగా పోరాటం జరిగిందని ఆ త్యాగాల ఫలితం ప్రస్తుతం మహిళలు అనుభవిస్తున్న హక్కులని వివరించారు. మహిళలు లేనిదే చరిత్ర లేదని తమ కోసం పని చేసిన సంఘ సంస్కర్తలు సంస్థలను గుర్తు చేసుకోవాలని వారు మీ భాద్యతలలో అంకిత భావంలో కొనసాగుతారని అన్నారు. ఇంకా పరిపూర్ణ సమానత్వం కోసం చాలా దూరం నడవాలని ఈ క్రమంలో నాయకత్వ స్థానాలలో, విధానాల రూపకల్పనలో ఆహార భద్రతలో సుస్థిర వ్యవసాయంలో వ్యాపార వాణిజ్య రంగాలలో భాగస్వామ్యం కోసం నిత్య కృషి అవసరమని అన్నారు. అడగందే ఆందోళన చేయందే పురుషాధిపత్య సమాజం ముందుకు రానివ్వదని అన్నారు. పిల్లలకు సమానత్వ విలువలు అందించడంలో మహిళలు ప్రత్యేక కృషి చేయాలని అప్పుడే అణచివేత లేని సమాజం ఏర్పడుతుందని అన్నారు. మార్చ్ 8 కి వందేళ్ళ చరిత్ర ఉందని ఆ స్ఫూర్తిని ప్రతి మహిళా అధికారి ఆచరణలో పెట్టాలన్నారు. రెండు రోజుల పాటు మహిళా దినోత్సవ వేడుకలను చైతన్యవంతంగా నిర్వహించిన తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘాన్ని అభినందించారు .
అనంతరం రెండు రోజుల పాటు నిర్వహించిన క్రీడా సాంస్కృతిక పోటీలలో విజేతలందరికి బహుమతులను ప్రదానం చేసారు .
విశిష్ట అతిథిగా హాజరైన టీజీఓ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ… టీజీఓ భూమి పుత్రిక సిద్ధాంతం వెలుగులో ఏర్పడిందని తెలంగాణ సమాజం ఉన్నతి కోసం పని చేసిన వైతాళికుల త్యాగ నిరతిని ఎలుగెత్తి చాటి ఆ స్ఫూర్తితో పని చేస్తున్నదని అన్నారు. ఉత్సవాలను విజయవంతం చేసిన వందలాది మంది మహిళా అధికారులను అభినందించారు.
టీ జి ఓ మహిళా విభాగం నేతలు డాక్టర్ దీపా రెడ్డి, జక్కంపూడి సుజాత, వనజా రెడ్డి, సునీత, శిరీష ల నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలలో అన్ని ప్రభుత్వ శాఖల నుండి వివిధ జిల్లాల నుండి మహిళా అధికారులు పెద్ద ఎత్తున క్రీడా పోటీలలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల డైరెక్టర్ రామ్ రెడ్డి, టీజీఓ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ సహ అధ్యక్ష్యుడు శ్యామ్, ఉపాద్యక్షుడు ప్రొఫెసర్ మల్లేశం, సహదేవ్, శ్రీనివాస మూర్తి, నవీనా జ్యోతి, సురేష్, కార్యదర్శి హరి కృష్ణ, పరమేశ్వర్ రెడ్డి, హైద్రాబాద్ నగర అధ్యక్షుడు గండూరి వెంకట్, జిల్లా అధ్యక్ష్యుడు కృష్ణ యాదవ్, రంగారెడ్డి నేత రామారావు శ్రీనిష్, మేడ్చల్ నేత వినోద్ కుమార్, కురుమూర్తి, సంగారెడ్డి వైద్యనాధ్, సంతోష్, నాగర్ కర్నూల్ సంజీవ్ లతో పాటు వందల సంఖ్యలో మహిళా అధికారులు పాల్గొన్నారు.