సమాజ చోదక శక్తులు అధికారులు టీజీఓ వరంగల్ డైరీ ఆవిష్కరణలో కలెక్టర్ సత్య శారద

TGO NEWS (JAN. 27) : Warangal TGOS Dairy Launched today. ప్రజల సమస్యల పట్ల సకాలంలో స్పందించి పరిష్కార మార్గాలను రూపొందించి ఆచరణలో అమలు చేయడంలో గెజిటెడ్ అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద అన్నారు.

తెలంగాణ గెజిటెడ్ అధికారుల ఈరోజు సంఘం వరంగల్ జిల్లా శాఖ డైరీని కలెక్టర్ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షుడు రామిరెడ్డి అధ్యక్ష్యతన జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా మాట్లాడారు.

వరంగల్ జిల్లా ఇతిహాసిక, సాంస్కృతిక రంగాలలో సారవంతమైందని, ఈ నేలలో చలన శీలత ఉందని, అది అధికారులను మరింత ఉత్కృష్టంగా పని చేయించడానికి ఉత్ప్రేరకంగా ఉంటుందని అన్నారు. ప్రజాపాలన నిబద్ధతతో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుందని అందుకు తగిన పర్యవేక్షణ సీయం, కేబినెట్ పెద్దలు చేస్తున్నారని అన్నారు.

వరంగల్ ను పారిశ్రామిక, ఎయిర్ పోర్ట్ సౌకర్యాల ఏర్పాటులో ఫ్లాగ్ షిప్ పథకాలను ప్రజలకు చేరవేయడంలో వరంగల్ పరిపాలన స్ఫూర్తిదాయకంగా ఉందని దీనిలో అధికారుల అంకితభావం అలుపులేని శ్రమ ఉందని అన్నారు. పనిలో దివ్యత్వం సంప్రదాయంతో మెరుగైన సమాజ నిర్మాణము జరుగుతుందని అన్నారు. దీనికి అధికారులే చోదక శక్తులు అని అన్నారు.

ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పాల్గొన్న టీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్నమనేని జగన్మోహన్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో టీజీఓ మహత్తర పాత్ర పోషించిందని అన్నారు.

టి జి ఓ సహాధ్యక్ష్యులు అనురాధ మాట్లాడుతూ 18 ఏండ్ల ప్రస్తావనలో టీజీఓ గెజిటెడ్ కేడర్ ఉద్యోగులకు సామాజిక భాద్యతతో సమాజానికి చేసిన సేవలను వివరించారు.

వేడుకగా, ఆలోచనాత్మకంగా, ఉత్సహభరితంగా జరిగిన ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, టీజీఓ రాష్ట్ర ప్రచార కార్యదర్శి, రచయిత అస్నాల శ్రీనివాస్, సాంస్కృతిక కార్యదర్శి కోలా రాజేష్ కుమార్, జిల్లా కార్యదర్శి ఫణి కుమార్, కోశాధికారి ఈగ వెంకట్, హన్మకొండ నేతలు మురళీధర్ రెడ్డి, ప్రవీణ్, జిల్లా కార్యవర్గ సభ్యులు భాగ్యలక్ష్మి, రామ చందర్ రావు, సుధీర్ కుమార్, విజయనిర్మల, హేమలత మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.